తక్కువ చదువుతో ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టే జాబ్స్

అధిక సంపాదన కావాలంటే అమెరికాలాంటి దేశాలే వెళ్లక్కర్లేదు.మన దేశంలో ఉండి కూడా లక్షలకు లక్షలు సంపాదిస్తూ కాలు మీద కాలు వేసుకుని బ్రతికేయచ్చు. అయితే అందుకు కావాల్సింది… కొద్దిగా బుర్ర..పనిచేసే తత్వం..మారుతున్న పరిస్దితుల మీద అవగాహన.  అయితే మీరు చెప్పేది వ్యాపారం గురించా అయితే మా దగ్గర పైసా లేదు..అంత సీన్ లేదు మాకు అంటారా అయితే మీకు ఇప్పుడు మేం చెప్పబోయే విషయాలు అసలు తెలియదన్నమాట. బారతదేశంలో అత్యథికంగా జీతం వచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుని అవి సంపాదిస్తే మీరు మీ టార్గెట్ రీచ్ అవుతారు.   చాలా మంది మనదేశంలో ఉద్యోగస్ధుకు పెద్దగా జీతాలు ఉండవు అని భావిస్తూంటారు. అయితే ప్రతీ నెలా లక్షలుకు లక్షలు తీసుకనే వారి మాటేంటని ఒక్కసారైనా ఆలోచించారా…అలాంటి వృత్తులు ఏమిటో చెప్తాం..ఫాలో అయిపోండి.  గ్రోత్ హేకర్స్ …గ్రాడ్యుయేట్ చదివిన వారికి ఈ ఉద్యోగం లభిస్తుంది. అరవై వేల నుంచి మూడు లక్షలు దాకా ఈ జీతాలు ఉన్నాయి. ఇంతకీ గ్రోత్ హేకర్స్ అంటే ఏమిటీ అంటారా..అది ఓ విధమైన మార్కెటింగ్ కు సంభందించిన జాబ్. బిజినెస్ కు బాగా ప్రభావితం చేసే మార్కెటింగ్ విధానాలును పట్టుకోవటం, వాటిని ప్రమోట్ చేసి, కంపెనీలను ముందుకు తీసుకు వెళ్లటం ఈ ఉద్యోగ ధర్మం. టెక్నికల్ రైటర్ సాధారణంగా వెబ్ బేసెడ్ కంటెంట్ రైటర్స్ కు మంచి డిమాండ్ ఉంది. అయితే అంతకు రెట్టింపు డిమాండ్ టెక్నకల్ రైటర్ కు ఉందంటే మీరు నమ్మరు. గ్రాడ్యుయేట్ చదువుకుని ఐటీ ఫర్మ్ స్ కు లేదా పోగ్రామింగ్ కంపెనీలకు చెందిన టెక్నికాలిటీల గురించి ఈ టెక్నికల్ రైటర్స్ రాయగలిగాలి. వీళ్లకు జీతం యాభై వేల నుంచి లక్ష డబ్బై వేల దాకా ఉంటుంది. రిలేషన్ షిప్ థెరిఫిస్ట్ లు అభివృథ్తి చెందిన ఇతర దేశాల్లో ఇది చాలా కామన్ ఉద్యోగం. ఇప్పుడిప్పుడే డవలప్ అవుతున్న మన దేశంలో ఈ ఉద్యోగానికి డిమాండ్ బాగా పెరిగింది. ఓ రకంగా ఇది సైకాలజిస్ట్ లు చేసే పనే కానీ, ఈ వృత్తిలో ఉన్న అనుభవం ఉన్న గ్యాడ్యుయేట్స్ సరిపోతారు. ముప్పై వేల నుంచి లక్ష దాకా జీతం లభిస్తుంది. సోషల్ మీడియా మేనేజర్ ఈ ఉద్యోగం కూడా మారుతున్న కాలంతో పాటు ఏర్పడిందే.  గ్యాడ్యుయేట్స్ ఎవరైనా ఈ రంగంలోకి రావచ్చు. ముప్పై వేల నుంచి మూడు లక్షలు దాకా వారి యొక్క ప్రతిభను బట్టి శాలరీ ఉంటోంది.  వీళ్లు ఉద్యోగ భాధ్యతల్లో ముఖ్యమైనది ప్రముఖ వ్యక్తుల సోషల్ మీడియా ఎక్కౌంట్స్ మేనేజ్ చెయ్యటం.  ఎస్ ఈవో ఎనాలసిస్ట్ లు ఇదీ సోషల్ మీడియా బాగా డవలప్ అయిన తర్వాత పుట్టుకొచ్చిన జాబే. ఎలా సోషల్ మీడియాలో పాపులర్ కావాలనే విషయాలు ఈ ఎనాలసిస్ట్ లు చెప్తారు. వీరికి  ముప్పై వేల నుంచి లక్ష దాకా జీతం ఉంది.